బియాండ్ విక్టిమ్స్ - 2021ని మీ ముందుకు తీస్కువస్తున్నందుకు మాకు చాలా సంతోషం గా ఉంది. ఈ సంవత్సరం ఎడిషన్ దక్షిణాసియా దేశాలకు చెందిన మహిళల నాయకత్వాన్ని హైలైట్ చేస్తుంది.
ప్రతి సంవత్సరం, మేము సాధ్యమైనంత ఎక్కువ అట్టడుగు స్థాయి నాయకుల కథనాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాము, ప్రత్యేకించి ఇంకా విస్తృతంగా గుర్తించబడని మహిళలు.
మహిళలు నిస్సహాయ బాధితులు కారు, సామర్థ్యం ఉన్న నాయకులు మరియు ప్రతిభావంతులు అనే ఉద్దేశం తో రూపొందిచడమైంది ఈ మా 'బియాండ్ విక్టిమ్స్' సిరీస్.
మా ప్రారంభ ఎడిషన్ బియాండ్ విక్టిమ్స్ సిరీస్ 2020లో, మహమ్మారి కారణంగా ఏర్పడిన సంక్షోభ సమయంలో మహిళల రాజకీయ నాయకత్వం గురించిన కథనాలను మేము మీ ముందుకు తీసుకు వచ్చాము.
గమనిక: ఈ ఎడిషన్‌ను తెలుగులోకి అనువదించే సమయానికి, ఆఫ్ఘనిస్తాన్‌లో దురదృష్టకర సంఘటనలు జరిగాయి, తాలిబాన్ స్వాధీనం మరియు దేశంలో పౌర ప్రభుత్వం పతనానికి దారితీసింది. కాబట్టి, కొంతమంది ఆఫ్ఘన్ రాజకీయ నాయకులకు పేర్కొన్న హోదాలు తాలిబాన్ ఆక్రమణకు ముందువి.
ఈ బియాండ్ విక్టిమ్స్ - 2021ని ఒకే డాక్యుమెంట్‌గా ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి -
భాగస్వాములు:
ఆఫ్ఘనిస్తాన్ ఎడిషన్ కోసం: గర్ల్స్ టువార్డ్ లీడర్‌షిప్ (ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఉన్న ఒక లాభాపేక్ష రహిత సంస్థ, నాయకత్వ నైపుణ్యాలపై కార్యక్రమాల ద్వారా ఆఫ్ఘన్ యువతులను శక్తివంతం చేయడంపై పని చేస్తోంది)
శ్రీలంక ఎడిషన్ కోసం: శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త ఉదయని నవరత్నం నిర్వహించిన వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా కథలు సేకరించబడ్డాయి.
వాలంటీయర్స్:
సందర్భోచితీకరణ: శ్రావ్య మరియు ప్రభాకర్
క్యూరేషన్: రిషిక, మధుబంతి, సానిక, మనీషా
గమనిక: మేము వాలంటీర్లచే నిర్వహించబడే సంస్థ. మేము తెలుగులో న్యూస్ లెటర్ ను సందర్భోచితంగా అనువాదం చేయడానికి మా వంతు ప్రయత్నం చేసాము. మీరు ఏవైనా లోపాలను గుర్తించినట్లయితే, దయచేసి contact@womenforpolitics.com కు ఈమైల్ రాయండి.
లింక్డ్‌ఇన్ మరియు ట్విట్టర్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి మరియు అప్‌డేట్‌గా ఉండటానికి మా వెబ్‌సైట్‌కు సభ్యత్వాన్ని పొందండి.
Kommentare